సినిమాయే నా ప్రపంచం .. షూటింగు లేకపోతే బ్రతకలేను!: శ్రీకాంత్ అయ్యంగార్
- విలక్షణ నటుడు అనిపించుకున్న శ్రీకాంత్ అయ్యంగార్
- సినిమాలంటే తనకి పిచ్చి అంటూ వ్యాఖ్య
- వచ్చిన వేషాలను చేసుకుంటూ వెళతానంటూ వెల్లడి
- ఆ మూడు వేషాలు మాత్రం వేయనంటూ నవ్వులు
" సినిమానే నా ప్రపంచం .. సెట్ లో అడుగుపెట్టేటప్పుడు నేను పొందే ఆనందం అంతా ఇంతా కాదు. రేపు షూటింగు ఉందని చెబితే .. ఈ రోజున నేను గాల్లో తేలిపోతూ ఉంటాను. సినిమా అంటే నాకు అంత ఇష్టం. నాతో ఫ్యామిలీ మెంబర్స్ లేకపోయినా .. భోజనం లేకపోయినా ఉండగలుగుతానుగానీ, సినిమా లేకుండా మాత్రం ఉండలేను" అని అన్నాడు.
" నేను ఏ తరహా పాత్రలకి సెట్ అవుతాననేది తెలుసును గనుక, ఆ తరహా పాత్రలే నాకు ఇస్తారు. అందువలన నాకు వచ్చిన పాత్రలను చేస్తూ వెళుతుంటాను. కాకపోతే కొత్తదనం ఉండేలా చూసుకుంటాను. హీరోవేషం వేయను .. హీరోయిన్ వేషం కూడా వేయను .. చిన్నపిల్లల వేషం అసలే వేయను. ఈ మూడు తప్ప అన్ని వేషాలు వేస్తాను" అంటూ నవ్వేశాడు.