కార్తి హీరోగా .. కమల్ నిర్మాతగా లోకేశ్ కనగరాజ్ మూవీ!
- 'సర్దార్'తో హిట్ కొట్టిన కార్తి
- 'ఖైదీ' సీక్వెల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
- ఈ లోగానే లోకేశ్ కనగరాజ్ తో చేసే ఛాన్స్
- మరోసారి కమల్ బ్యానర్లో లోకేశ్
అయితే 'ఖైదీ' సీక్వెల్ సంగతి అటుంచితే, ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందనేది కోలీవుడ్ టాక్. ఈ సినిమాకి నిర్మాత కమల్ హాసన్ కావడం విశేషం. ఆయన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. తనకి 'విక్రమ్' సినిమాతో హిట్ ఇచ్చిన దగ్గర నుంచి లోకేశ్ కనగరాజ్ పై కమల్ కి మరింత నమ్మకం ఏర్పడింది. అందువలన ఈ ప్రాజెక్టు సెట్ అయినట్టుగా సమాచారం.
ఇక లోకేశ్ కనగరాజ్ విషయానికొస్తే విజయ్ కి 'మాస్టర్' హిట్ ఇచ్చిన ఆయన, మరోసారి విజయ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత ఆయన 'ఖైదీ 2' చేస్తాడా? 'విక్రమ్ 2' చేస్తాడా? లేదంటే కమల్ బ్యానర్లో కార్తి హీరోగా సినిమా చేస్తాడా? అనే విషయంలో క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు.