'కాంతారా' చూశాను.. ఇప్పటికీ నా శరీరం వణుకుతోంది: కంగనా రనౌత్
- ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మరో కన్నడ చిత్రం 'కాంతారా'
- సినిమా అంటే ఇలా ఉండాలి అన్న కంగన
- మరో వారం పాటు ఈ అనుభూతి నుంచి బయటకు రాలేనేమో అని వ్యాఖ్య
'రిషబ్ శెట్టి నీకు హ్యాట్సాఫ్. రచన, దర్శకత్వం, నటన, యాక్షన్ అంతా అద్భుతం. నమ్మలేకపోతున్నా. అందమైన ఫొటోగ్రఫీ, యాక్షన్, థ్రిల్లర్. సినిమా అంటే ఇలా ఉండాలి. ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమా చూడాలంటే ఇలా ఉండాలి. ఇప్పటి వరకు ఇలాంటి సినిమాను చూడలేదంటూ కొందరు ప్రేక్షకులు సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తూ అనుకుంటుండటం నేను విన్నాను. ఇలాంటి సినిమా తీసినందుకు ధన్యవాదాలు. మరో వారం పాటు ఈ అనుభూతి నుంచి నేను బయటకు రాలేననే అనుకుంటున్నా' అని కంగన తన ఇన్స్టా స్టోరీస్ లో పేర్కొంది.