సుందరమైన కోనసీమలో షూటింగ్ పూర్తి చేసుకున్న 'శశివదనే'
- రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా 'శశివదనే'
- లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం
- ప్రేమ సన్నివేశాలు రిఫ్రెష్ గా ఉంటాయన్న నిర్మాత అహితేజ బెల్లంకొండ
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ... 'శశివదనే' చిత్రాన్ని కోనసీమలోని సుందరమైన లొకేషన్లలో 50 రోజుల పాటు చిత్రీకరించామని తెలిపారు. అద్భుతమైన అనుభవం, జ్ఞాపకాలను అందించిన కోనసీమకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సినిమాలోని ప్రేమ సన్నివేశాలు రిఫ్రెష్‌గా ఉండబోతున్నాయని చెప్పారు.
‘పలాస 1978’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ నటుడు రక్షిత్ అట్లూరి ఈ సినిమాలో కూడా చాలా చక్కని నటనను కనపరిచాడని ప్రశంసించారు. హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా చాలా చక్కగా నటించిందని కితాబునిచ్చారు. దర్శకుడు మోహన్ ఉబ్బర ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు. ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయని... అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.



