అతడు ఎన్టీఆర్ కొడుకేనా అనిపించింది... బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై లక్ష్మీపార్వతి స్పందన
- అన్ స్టాపబుల్ రెండో సీజన్
- ఇటీవల చంద్రబాబుతో ఎపిసోడ్
- తీవ్రంగా స్పందించిన లక్ష్మీపార్వతి
- బాలకృష్ణను చూస్తే అసహ్యం వేస్తోందని విమర్శలు
తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు, బాలకృష్ణ ఈ షోను ఎంచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాడు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాడన్నది ఒట్టి అబద్ధమని స్పష్టం చేశారు. నాడు పార్టీలో గొడవలు చేయించింది, ఎమ్మెల్యేలను రెచ్చగొట్టింది, ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రోడ్ల పైకి పిలిచింది చంద్రబాబేనని స్పష్టం చేశారు.
ఇక, అన్ స్టాపబుల్-2 తాజా ఎపిసోడ్ చూశాక బాలకృష్ణ అంటేనే రోత పుడుతోందని, అతడు ఎన్టీఆర్ కొడుకేనా అని అసహ్యం కలుగుతోందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఆ షో చూస్తుంటే, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినవాళ్లు ఒకరినొకరు సమర్థించుకున్నట్టుగా ఉందని విమర్శించారు.