మతమార్పిడి వివాదంలో చిక్కుకున్న ‘ఆప్’ మంత్రి రాజీనామా
- మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిపై బీజేపీ విమర్శలు
- తన రాజీనామా పత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన రాజేంద్ర పాల్
- బీజేపీ నీచ రాజకీయాలకు నిరసనగానే అన్న ‘ఆప్’ నేత
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు తాను సంకెళ్ల నుంచి విముక్తి పొందానని అన్నారు. ఈ రోజు తాను మళ్లీ పుట్టానని, ఇకపై ఎలాంటి ఆంక్షలు లేకుండా హక్కుల కోసం, సమాజంపై జరిగే దౌర్జన్యాల విషయంలో మరింత గట్టిగా పోరాడతానని అన్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతేకాదు, ఇటీవలి వ్యవహారంలో బీజేపీ తనతోపాటు కేజ్రీవాల్‌ను కూడా లక్ష్యంగా చేసుకోవడం బాధాకరమన్నారు. బీజేపీ నీచ రాజకీయాలకు నిరసనగానే తన పదవికి రాజీనామా చేసినట్టు రాజేంద్ర పాల్ గౌతమ్ పేర్కొన్నారు.