దగ్గుబాటి అభిరామ్ 'అహింస' .. టీజర్ రిలీజ్!
- తేజ నుంచి వస్తున్న 'అహింస'
- హీరోగా రానా తమ్ముడి పరిచయం
- హీరోయిన్ గీతికకు ఇదే ఫస్టు మూవీ
- ఈ సినిమాతో ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ
- త్వరలోనే థియేటర్లకు రానున్న సినిమా
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఇది ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ అనే విషయం ఈ టీజర్ ద్వారా అర్థమవుతోంది. రఘు - అహల్య బావా మరదళ్లు. ఒకరంటే ఒకరికి ఇష్టం .. ప్రేమ. అమాయకుడైన రఘును అహల్య అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది. అలాంటివారి జీవితం అల్లకల్లోలమవుతుందనే విషయాన్ని టీజర్ చెబుతోంది.
అందుకు కారకులు ఎవరు? ఆ పరిస్థితులను ఆ ప్రేమికులు ఎలా తట్టుకుని నిలబడ్డారు? అనేదే కథ అనే విషయం స్పష్టమవుతోంది. కథానాయికగా ఈ సినిమాతో గీతిక పరిచయమవుతోంది. సదా .. రజత్ బేడీ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాతో ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. గతంలో తేజ కాంబినేషన్లో ఆయన అనేక సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.