అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా విషాదం.. నదిలో కొట్టుకుపోయి 8 మంది మృతి: వీడియో ఇదిగో!
- పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురిలో ఘటన
- అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా పోటెత్తిన వరద
- 50 మందిని రక్షించిన సహాయక బృందాలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
నిమజ్జనం సందర్భంగా వందలాదిమంది ప్రజలు నది ఒడ్డుకు చేరుకున్నారు. నది మధ్యలో నిమజ్జనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వరద పోటెత్తిందని జిల్లా కలెక్టర్ మౌమిత గొడర బసు తెలిపారు. సిక్కిం వంటి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించినట్టు తెలిపారు. కాగా, అందరూ చూస్తుంగానే నదిలో యువకులు కొట్టుకుపోతున్నా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. యువకులు నదిలో కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.