మణిరత్నం 'పీఎస్1'కు తొలి రోజు భారీ వసూళ్లు
- తమిళనాడులో రూ. 25.86 కోట్లు
- అమెరికా, ఆస్ట్రేలియాలోనూ దూసుకెళ్తున్న చిత్రం
- మిశ్రమ స్పందన వచ్చినా వసూళ్లలో దూకుడు
ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రంగా నిలిచింది. తమిళనాడులో 25.86 కోట్ల రూపాయలను వసూలు చేసింది. వాలిమై (రూ. 36.17 కోట్లు), బీస్ట్ (రూ. 26.40 కోట్లు) తర్వాత మూడో స్థానంలో నిలిచింది. హిందీ సర్క్యూట్ సుమారు రూ. 1.75 కోట్ల కలెక్షన్లను నమోదు చేసిందని బాక్సాఫీస్ ఇండియా పేర్కొంది.
అమెరికాలో 'పీఎస్1' దూసుకెళ్తోందని ట్రేడ్ ఎనలిస్ట్ రమేష్ బాలా తెలిపారు. యూఎస్ఏలో వరుసగా రెండు రోజులు ఒక మిలియన్ మార్క్ వసూళ్లు రాబట్టిన తొలి తమిళ చిత్రంగా నిలిచిందని తెలిపారు. ఆస్ట్రేలియాలో కూడా అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచిందన్నారు. కాగా, పొన్నియిన్ సెల్వన్ రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. మరిన్ని పార్టులు కూడా ఉన్నాయి.