నాని 'దసరా' నుంచి ఆసక్తికరమైన అప్ డేట్ సిద్ధం!
- నాని హీరోగా రూపొందిన 'దసరా'
- బొగ్గుగనుల నేపథ్యంలో నడిచే కథ
- నాని జోడీగా రెండోసారి కనిపించనున్న కీర్తి సురేశ్
- మార్చి 30వ తేదీన విడుదల
ఈ సినిమాలో నాని పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నాడు. రామగుండం బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా పేరు 'దసరా' కావడంతో .. 'దసరా' పండుగకి ఏదైనా అప్ డేట్ వదులుతారా? అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పండుగ కానుకగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.
ఈ విషయాన్ని నానితో ఎనౌన్స్ చేయిస్తూ చిన్నపాటి వీడియో ఒకటి వదిలారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చాడు. రాజేంద్ర ప్రసాద్ .. ప్రకాశ్ రాజ్ .. సముద్రఖని .. ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నారు.