సినీ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ను కోట్ల మేర మోసం చేసిన వ్యాపారి
- టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన రవికిషన్
- యూపీ నుంచి బీజేపీ తరపున గెలుపొందిన సినీ నటుడు
- రూ. 3.25 కోట్ల మేర మోసపోయిన వైనం
2012లో జైన్ జితేంద్ర రమేశ్ అనే వ్యాపారికి రవికిషన్ రూ. 3.25 కోట్ల మొత్తాన్ని ఇచ్చాడు. తిరిగి తన డబ్బు ఇవ్వాలని అడిగితే... ఒక్కోటి రూ.34 లక్షల విలువైన 12 చెక్కులను ఇచ్చాడు. ఈ చెక్కుల్లో ఒకదాన్ని గత ఏడాది డిసెంబర్ లో రవికిషన్ డిపాజిట్ చేశాడు. అయితే ఆ చెక్ బౌన్స్ అయింది. దీంతో, డబ్బు చెల్లించమని జితేంద్రను ఒత్తిడి చేస్తున్నప్పటికీ... ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో జితేంద్రపై రవికిషన్ పీఆర్వో దూబే నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జితేంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు.