తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి సెటైర్లు
- మునుగోడులో బీజేపీ మూడో స్థానంలో ఉందన్న మంత్రి
- అందుకే ఉప ఎన్నికకు వెనకడుగు వేస్తోందని వ్యాఖ్య
- ముందస్తు ఎన్నికలు వస్తాయని చెపుతుండటం హాస్యాస్పదమన్న జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తర్వాతే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందని ఇంతకుముందు కోమటిరెడ్డి చెప్పారని... ఇప్పుడు మరోమాట మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ చెపుతుండటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. సైనికులు, రైతుల కుటుంబాలను కేసీఆర్ పరామర్శిస్తుంటే విమర్శలు చేస్తుండటం విపక్షాల హ్రస్వ దృష్టికి నిదర్శనమని అన్నారు. జవాన్ల త్యాగాలను కూడా గుర్తించలేని గొప్ప దేశ భక్తులు విపక్ష నేతలని దుయ్యబట్టారు.