మునావర్ ఫారూఖీ షోకు క్యూ కట్టిన హైదరాబాదీలు.. ఫొటో ఇదిగో
- శిల్ప కళావేదిక కేంద్రంగా మునావర్ షో
- హిందూ దేవుళ్లను కించపరుస్తాడని ఫారూఖీపై ఆరోపణలు
- చివరి నిమిషంలో అనుమతి ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు
- నిర్ణీత సమయానికంటే ముందుగా తరలివచ్చిన నగరవాసులు
ఇప్పటికే పెద్ద ఎత్తున రచ్చ జరిగిన ఈ షోకు నగర వాసులు పోటెత్తారు. బుక్ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన హైదరాబాదీలు... షో మొదలు కావడానికి ముందే శిల్ప కళావేదిక వద్ద క్యూ కట్టారు. మునావర్ షోను అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శిల్ప కళావేదిక పరిసరాల్లో వేలాది మంది పోలీసులు పహారా కాస్తున్నారు. అయినప్పటికీ నగరవాసులు మునావర్ షో పట్ల అమితాసక్తి కనబరచారు.