నెట్ ఫ్లిక్స్ చౌక ప్లాన్.. అయితే, ఆఫ్ లైన్ వీడియో వీక్షణ ఉండదట!
- వాణిజ్య ప్రకటనలతో చౌక ప్లాన్ తెచ్చే సన్నాహాలు
- కస్టమర్లు చేజారిపోకుండా చర్యలు
- లీకైన కొంత సమాచారం
దీనికి సంబంధించి కొంత సమాచారం లీక్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చే ఈ చౌక ప్లాన్ (నెట్ ఫ్లిక్స్ విత్ యాడ్స్)లో ఆఫ్ లైన్ వీక్షణ ఫీచర్ ఉండదు. షోలు, మూవీలను యాప్ లోకి డౌన్ లోడ్ చేసుకుని, తర్వాత చూడ్డానికి వీలు పడదు. ప్రయాణంలో ఉన్న వారికి ఆఫ్ లైన్ వ్యూయింగ్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. నెట్ కవరేజీ సరిగ్గా లేకపోయినా, కంటెంట్ ను చూసుకోగలరు. నెట్ ఫ్లిక్స్ విత్ యాడ్స్ ప్లాన్ గురించి సంస్థ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారాన్ని విడుదల చేయలేదు.