లోకేశ్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి: కార్తి
- 'విక్రమ్' గురించి ప్రస్తావించిన కార్తి
- కమల్ కోసమే సూర్య ఒప్పుకున్నాడని వ్యాఖ్య
- సీక్వెల్ కి లోకేశ్ మరింత కష్టపడాలన్న కార్తి
- తాను ఉత్సాహంతో ఉన్నానంటూ వెల్లడి
తాజాగా ఈ విషయాన్ని గురించి కార్తి మాట్లాడుతూ .. "లోకేశ్ రోలెక్స్ పాత్ర కోసం సూర్యను అడిగినప్పుడు, కమల్ పట్ల గల అభిమానంతో తను ఒప్పుకున్నాడు. ఇక 'ఖైదీ' సినిమాలోని పాత్ర 'విక్రమ్' సినిమాలో కూడా నడుస్తున్నట్టుగా చూపిస్తానని అంటే , నేను కూడా అందుకు అంగీకరించాను.
ఇలా చేయడం వలన ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. ఇక 'విక్రమ్' సెకండ్ పార్టులో అటు రోలెక్స్ పాత్ర విషయంలో .. ఇటు 'ఖైదీ' సినిమాలోని డిల్లీ పాత్ర విషయంలో లోకేశ్ మరింత కష్టపడవలసి ఉంటుంది. ఈ ట్రాక్స్ విషయంలో ఆయన ఎంతో కసరత్తు చేయవలసి ఉంటుంది. ఈ విషయంలో ఆయన ఏం మ్యాజిక్ చేయనున్నాడనేది చూడాలి" అంటూ చెప్పుకొచ్చాడు.