తనతో డేటింగ్ చేయాలనుందన్న బాలీవుడ్ భామకు టెక్ట్స్ మెసేజ్ పంపిన విజయ్ దేవరకొండ!
- 'కాఫీ విత్ కరణ్' లో పాల్గొన్న సారా అలీ ఖాన్
- ఎవరితో డేటింగ్ చేస్తావన్న కరణ్ జొహార్
- విజయ్ పేరు చెప్పిన సారా
- తాను 'రిలేషన్ షిప్' పదాన్ని కూడా సరిగా పలకలేనన్న విజయ్
అయితే దీనిపై విజయ్ దేవరకొండ స్పందన ఎలా ఉందో తెలుసుకుందామని జాతీయ మీడియా ప్రయత్నించింది. అందుకు విజయ్ బదులిస్తూ, 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే సారా అలీ ఖాన్ కు టెక్ట్స్ మెసేజ్ పంపించానని వెల్లడించాడు. ఆమె తనతో డేటింగ్ చేయాలని ఉందని చెప్పడం సంతోషానికి గురిచేసిందని తెలిపాడు.
అయితే సారా డేటింగ్ ప్రతిపాదనకు ఏం సమాధానం చెబుతారని అడగ్గా... "రిలేషన్ షిప్ అనే పదాన్ని కూడా సరిగ్గా చెప్పలేని వాడ్ని... ఇక నేను ఆ సంబంధంలో ఎలా ఇమడగలను!" అంటూ తెలివిగా తప్పించుకున్నాడు.