'ఇండియన్ పోలీస్ ఫోర్స్' షూటింగ్ లో కాలు విరిగింది: శిల్పా శెట్టి
- రోహిత్ శెట్టి దర్శకత్వంలో వెబ్ సిరీస్
- షూటింగ్ లో గాయపడిన శిల్పా శెట్టి
- 6 వారాలు విశ్రాంతి
- నాకోసం ప్రార్థించండి అంటూ శిల్పా విజ్ఞప్తి
"వాళ్లు రోల్, కెమెరా, యాక్షన్ అన్నారు... అంతే... నా కాలు విరిగిపోయింది. తప్పదు, బాధ వచ్చినప్పుడు బాధపడాల్సిందే. గాయం కారణంగా 6 వారాల పాటు షూటింగ్ కు దూరం కావాల్సి వస్తోంది. అయితే మరింతగా పుంజుకుని తిరిగి వస్తాను. నాకోసం మీరు ప్రార్థిస్తారు కదూ! ప్రార్థనలు ఎప్పుడూ ఫలిస్తాయి" అంటూ శిల్పాశెట్టి ఇన్ స్టాగ్రామ్ లో వివరించింది.
.