గతంలో నాగచైతన్యతో కలిసి ఉన్న ఇంటిని సమంత మళ్లీ కొనుక్కుంది: మురళీమోహన్
- 2021లో విడిపోయిన సమంత, నాగచైతన్య
- కలిసున్నప్పుడే పాత ఇంటిని అమ్మేసిన వైనం
- కానీ పాత ఇంటిపై సమంత ఆసక్తి
- అధికధర చెల్లించి మళ్లీ కొనుగోలు చేసిందన్న మురళీమోహన్
గతంలో ఆ ఇంటిలో సమంత, నాగచైతన్య కలిసి ఉండేవారని, అయితే ఆ ఇంటిని అమ్మేసి ఓ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నారని వెల్లడించారు. కొత్త ఇంటి పనులు ఇంకా జరుగుతుండడంతో, కొన్నాళ్ల పాటు ఈ పాత ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. ఇక, సమంత, నాగచైతన్య విడిపోయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీగా ఉండిపోయిందని అన్నారు. కొంతకాలం తర్వాత సమంత తన వద్దకు వచ్చి ఆ ఇంటిని మళ్లీ కొనుగోలు చేసేందుకు ప్రతిపాదన చేసిందని మురళీమోహన్ వెల్లడించారు.
మరొక చోట ఉండేందుకు సమంత ఇష్టపడలేదని, పాత ఇల్లే సురక్షితంగా ఉంటుందని ఆమె భావించిందని తెలిపారు. అందుకే అత్యధిక ధర చెల్లించి తమ పాత ఇంటిని కొనుగోలు చేసిందని మురళీమోహన్ వివరించారు. ఆ ఇల్లు తన సోదరుడు, కొడుకుతో కలిసి నివసించేందుకు మల్టీఫ్లోర్ హౌస్ గా కట్టుకున్నామని, సమంత, నాగచైతన్యల పెళ్లయ్యాక వారి కొత్త కాపురం ఆ ఇంట్లోనే మొదలైందని మురళీమోహన్ వెల్లడించారు.
వారిద్దరూ విడిపోతారని తాను అసలు ఊహించలేదని, పర్ఫెక్ట్ జంట అంటే వాళ్లే అనుకున్నానని పేర్కొన్నారు. వాళ్లసలు గొడవపడడం ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. ఎక్కువగా ఇద్దరూ కలిసి జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపించేవారని వెల్లడించారు. బయటి వ్యక్తులను ఇంటికి తీసుకురావడం, పెద్ద శబ్దంతో సంగీతం, పార్టీలు చేసుకోవడం వంటి సమస్యలు లేనేలేవని అన్నారు. వాళ్ల ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండేదని, అలాంటి వాళ్లు విడిపోతున్నట్టు తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని మురళీమోహన్ పేర్కొన్నారు.