'దసరా'లో లేడీ విలనిజమే హైలైట్ అట!
- నాని తాజా చిత్రంగా రూపొందిన 'దసరా'
- దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల పరిచయం
- సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణ
- నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో పూర్ణ
- రెండోసారి నానీ జోడీ కట్టిన కీర్తి సురేశ్
ఈ సినిమాకి లేడీ విలనిజం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. లేడీ విలన్ గా కనిపించనున్నది ఎవరో కాదు .. పూర్ణ. ఆమెకి సంబంధించిన పోర్షన్ ను చాలావరకూ చిత్రీకరించారట. ఈ విషయాన్ని పూర్ణ ధ్రువీకరించింది కూడా. తన కెరియర్లో ఈ పాత్ర చెప్పుకోదగినది అవుతుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది.
సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ సందడి చేయనుంది. నానీతో ఆమె చేస్తున్న రెండవ సినిమా ఇది. డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మాస్ లుక్ తో నాని ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి మరి.