బోయపాటి సినిమాలంటే ఇష్టం: రామ్
- రేపు థియేటర్లకు రానున్న 'ది వారియర్'
- వచ్చే నెల నుంచి బోయపాటితో సెట్స్ పైకి
- ఆయనపై భరోసా ఉందంటూ వ్యాఖ్య
తన తదుపరి సినిమా బోయపాటితో ఉందనే విషయం తెలిసిందే. ఆ విషయాన్ని గురించి రామ్ ప్రస్తావిస్తూ .. "మొదటి నుంచీ కూడా నాకు బోయపాటి సినిమాలంటే ఇష్టం. ఆయన సినిమాలను నేను తప్పకుండా చూస్తుంటాను. తన కథల్లో మాస్ అంశాలు చేరుస్తూనే ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడం ఎలాగన్నది ఆయనకి బాగా తెలుసు.
నాకు ఆ యన వినిపించిన కథ కూడా అదే తరహాలో ఉంది. ఆయన ట్రీట్మెంట్ పై నాకు బలమైన నమ్మకం ఉంది. అందువల్లనే నా పాన్ ఇండియా సినిమా ఆయనతో ఉండాలని ఆశించాను. అందుకు అన్నీ కుదిరినందుకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చేనెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుంది" అని చెప్పాడు.