పేర్ని నాని నోటి విరేచనాలతో బాధ పడుతున్నారు: నాగబాబు
- తిండి అరగక పేర్ని నాని నోటికొచ్చినట్టు వాగుతున్నారన్న నాగబాబు
- వైసీపీ నేతలకు పవన్ సాత్వికమైన ఆహారాన్ని పెట్టాలంటూ కామెంట్
- పేర్ని నానికి దగ్గర్లో ఎవరైనా డాక్టర్ ఉంటే మందు ఇవ్వాలని సలహా
వపన్ కల్యాణ్ ఒక వింత పోకడలు ఉన్న రాజకీయ నాయకుడని... ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ ఊహించి ఉండరని పేర్ని నాని విమర్శించిన సంగతి తెలిసిందే. షూటింగులకే కాకుండా, రాజకీయాలకు కూడా ఆయన ఆలస్యమేనని ఎద్దేవా చేశారు. పవన్ చేసేది వీకెండ్ ప్రజాసేవ అని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై నాగబాబు మండిపడ్డారు.