రిషి సునాక్ సహా 10 మంది మంత్రుల రాజీనామా... పీకల్లోతు కష్టాల్లో బోరిస్ జాన్సన్ సర్కారు
- వివాదంలో చిక్కిన ఎంపీకి మంత్రి పదవి
- జాన్సన్ తీరుపై ఆయన కేబినెట్ మంత్రుల అసంతృప్తి
- మంగళవారమే రాజీనామా చేసిన సునాక్, జావెద్
ఫలితంగా జాన్సన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పదా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పటికే పెను వివాదంలో చిక్కుకున్న ఎంపీ క్రిస్ పించర్‌ను తన కేబినెట్‌లోకి తీసుకోవడంతో జాన్సన్‌పై ఆయన కేబినెట్ మొత్తం అసంతృప్తిగా ఉంది. ఈ కారణంగానే వరుసబెట్టి మంత్రులంతా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ సంక్షోభం నుంచి జాన్సన్ ఎలా బయటపడతారన్నది చూడాలి.