అల్లూరి సీతారామరాజు బంధువులు, సంబంధీకులతో మోదీ ప్రత్యేక భేటీ
- రేపు భీమవరంలో పర్యటించనున్న మోదీ
- అల్లూరి సోదరుడు, సోదరి మనవళ్లతో మోదీ భేటీ
- మొత్తం 37 మందిని గుర్తించిన అధికారులు
వీరందరితో మోదీ రేపు ప్రత్యేకంగా భేటీ అవుతారు. నిజానికి ప్రధాని సభా వేదికపైకే వీరిని ఆహ్వానించాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా దానిని విరమించుకుని ప్రధానితో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేశారు. కాగా, వేదికపై మోదీతోపాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మంత్రి రోజా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు తదితరులు ఉంటారు.