మహిళలతో కలిసి కోలాటం ఆడిన బీజేపీ నేత... వీడియో ఇదిగో
- శని, ఆదివారాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
- హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా సమావేశాలు
- ఉత్సాహంగా కనిపిస్తున్న సమావేశాల వేదిక
- కోలాటం ఆడిన సునీల్ దేవ్‌ధర్
పార్టీకి చెందిన కీలక నేతలంతా హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో నగరంలో కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇక సమావేశాల వేదిక హెచ్ఐసీసీ వద్ద అయితే ఓ రేంజి సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యకారులను రప్పించిన బీజేపీ నేతలు వారితో కలిసి కాలు కదుపుతూ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జీగా వ్యవహరిస్తున్న సునీల్ దేవ్‌ధర్ అయితే కోలాటం ఆడే మహిళలతో కలిసి తానూ కాలు కదిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.