వంగవీటి రాధాతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ
- విజయవాడలో రాధా ఇంటికెళ్లిన నాదెండ్ల
- తమది కేవలం మర్యాదపూర్వక భేటీనేనన్న మనోహర్
- ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న వంగవీటి రాధా
ఈ సందర్భంగా భేటీ అనంతరం నాదెండ్లతో కలిసి తన నివాసం బయటకు వచ్చిన రాధాకృష్ణ మీడియాతో పెద్దగా మాట్లాడలేదు. అదే సమయంలో కేవలం మర్యాదపూర్వకంగానే రాధాతో భేటీ అయ్యానని నాదెండ్ల తెలిపారు. తొలుత కాంగ్రెస్లో ఉన్న వంగవీటి... ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరారు. తదనంతరం వైసీపీలో కొంతకాలం పాటు కొనసాగిన ఆయన 2019 ఎన్నికలకు ముందు టీడీపీలోకి చేరిపోయారు. తాజా భేటీ నేపథ్యంలో జనసేనలోకి రాధా చేరిపోతారా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.