పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు భార్య తేజస్విని
- 2020లో వరంగల్‌కు చెందిన తేజస్వినిని రెండో వివాహం చేసుకున్న దిల్‌రాజు
- అనారోగ్యంతో 2017లో మృతి చెందిన మొదటి భార్య అనిత
- మొదటి భార్యతో దిల్‌రాజుకు ఇప్పటికే ఒక కుమార్తె
దిల్‌రాజు మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2017లో మరణించారు. ఈ క్రమంలో 10 డిసెంబరు 2020లో వరంగల్‌కు చెందిన తేజస్వినిని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. దిల్‌రాజుకు మొదటి భార్య ద్వారా ఇప్పటికే ఓ కుమార్తె హన్షిత ఉంది.
ఇదిలావుంచితే, దిల్‌రాజు ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ‘వారసుడు’ సినిమా చేస్తుండగా, రామ్‌చరణ్-శంకర్ కాంబోలో మరో సినిమా రూపొందుతోంది.