బాలినేని తరహాలోనే నేను కూడా ఇంటిపోరు ఎదుర్కొంటున్నా: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- కొందరు వైసీపీ నేతలు నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు
- నా నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు
- ఇలాంటి పనులు పార్టీకి మేలు చేయవు
బాలినేని మూడు జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నారని... అలాంటి వ్యక్తికి స్థానిక నేతలు అండగా ఉండాలే కానీ, అడ్డంకిగా మారకూడదని కోటంరెడ్డి అన్నారు. బాలినేని ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పారు. కొందరు ముఖ్య నేతలు వారి నియోజకవర్గాల్లో ఎలా గెలవాలో ఆలోచించకుండా... ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి పనులు పార్టీకి ఏమాత్రం మేలు చేయవని చెప్పారు.