ప్రజా వేదిక కూల్చివేతకు నేటితో మూడేళ్లు... చంద్రబాబు ఇంటి వద్ద హైటెన్షన్
- ప్రజా వేదిక వద్ద నిరసనకు టీడీపీ వ్యూహం
- చేరుకుంటున్న గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలు
- ముందస్తు జాగ్రత్త చర్యల కింద భారీగా చేరుకున్న పోలీసులు
- కరకట్టపై వాహనాల రాకపోకలను నిలిపివేసిన వైనం
ఈ సమాచారం అందుకున్న పోలీసులు ప్రజా వేదిక కూల్చివేత ప్రాంతం వద్దకు భారీగా చేరుకున్నారు. ఇప్పటికే కరకట్టపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న పోలీసులు చంద్రబాబు నివాసం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటు దిశగా ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.