400 కోట్ల మార్కుకి చేరువలో 'విక్రమ్'
- ఈ నెల 3న విడుదలైన 'విక్రమ్'
- కమల్ సొంత బ్యానర్లో వచ్చిన సినిమా
- దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్
- 17 రోజుల్లో 370 కోట్ల గ్రాస్ వసూలు
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 3వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. చాలాకాలం తరువాత ప్రేక్షకులు తెరపై మునుపటి కమల్ ను చూశారు. స్క్రీన్ ప్లే సామాన్య ప్రేక్షకులకు కాస్త క్లిష్టంగా అనిపించినా, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 17 రోజుల్లో ఈ సినిమా 370 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టుగా సమాచారం. 400 కోట్ల మార్క్ ను చేరుకోవడానికి ఇంకా ఎంతో సమయం పట్టదనే విషయం అర్థమైపోతూనే ఉంది. ఈ 3 వారాల్లో వేరే సినిమాలు చాలా థియేటర్లకు వచ్చినా, అవి 'విక్రమ్' వసూళ్లపై ప్రభావం చూపించలేకపోవడం విశేషం.