సాయి పల్లవికి మద్దతు ప్రకటించిన ప్రకాశ్ రాజ్
- విరాటపర్వంలో నటించిన సాయి పల్లవి
- ఇంటర్వ్యూలో భాగంగా కశ్మీర్ పండిట్లు, గోహత్యను ప్రస్తావించిన సాయి పల్లవి
- వాటిపై వివాదం రేగగా వివరణ ఇచ్చిన నటి
- మానవత్వమే అన్నింటికంటే ముందు అన్న ప్రకాశ్ రాజ్
రానాతో కలిసి తాను నటించిన విరాట పర్వం చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఎవరి పక్షం అంటూ ఓ ప్రశ్న ఎదురు కాగా... ఆ ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో సాయి పల్లవి కశ్మీర్ పడింట్లు, గో హత్యలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వివాదం రేగగా... దానిపై సాయి పల్లవి శనివారం వివరణ ఇచ్చారు. ఈ వివరణ చూశాక సాయి పల్లవికి మద్దతు ప్రకటిస్తూ ప్రకాశ్ రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.