ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులు స్టార్ టీవీ సొంతం... డిజిటల్ హక్కులు చేజిక్కించుకున్న వయాకామ్ 18
- ముగిసిన ఐపీఎల్ ప్రసార హక్కుల బిడ్డింగ్
- రూ.23,575 కోట్లతో బిడ్ వేసిన స్టార్ ఇండియా
- ఐదేళ్ల కాలావధికి హక్కులు సొంతం
- రూ.23,758 కోట్ల మేర బిడ్ వేసిన వయాకామ్
టీవీ ప్రసార హక్కులను స్టార్ ఇండియా దక్కించుకుందని, స్టార్ ఇండియా అత్యధికంగా రూ.23,575 కోట్లకు బిడ్ వేసిందని తెలిపారు. మొత్తమ్మీద ఓవరాల్ గా ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ రూ.48,390 కోట్లు అని జై షా వివరించారు.
వరుసగా రెండేళ్లు కరోనా సంక్షోభం వేధించినప్పటికీ, ఈ స్థాయిలో బిడ్డింగ్ రావడం బీసీసీఐ సంస్థాగత సామర్థ్యాలకు గీటురాయి అని వివరించారు. ఓ మ్యాచ్ విలువను పరిగణనలోకి తీసుకుంటే ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన స్పోర్టింగ్ లీగ్ ల్లో రెండోస్థానంలో ఉంటుందని తెలిపారు. కాగా, ఐపీఎల్ ద్వారా సమకూరిన ఆదాయాన్ని బీసీసీఐ క్షేత్రస్థాయి నుంచి దేశవాళీ క్రికెట్ ను అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తుందని వెల్లడించారు.