ఉండవల్లి అరుణ్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విష్ణువర్ధన్ రెడ్డి
- ఉండవల్లి ఊసరవెల్లి రాజకీయాలు చేయడం మానేయాలన్న విష్ణువర్ధన్ రెడ్డి
- రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెపుతూనే రాజకీయాలు చేస్తారని మండిపాటు
- కాంగ్రెస్ ను పైకి లేపడంపై దృష్టి సారించాలని హితవు
మరోవైపు కేసీఆర్ ను కలిసిన ఉండవల్లి అరుణ్ కుమార్ పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెపుతూనే ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారని, వివిధ రాజకీయ నేతలను కలుస్తుంటారని... వీటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే అబ్బెబ్బే అదేం లేదండి, ఉత్తినే పిలిస్తే వెళ్లానంటారని ఎద్దేవా చేశారు. ఉండవల్లి ఊసరవెల్లి రాజకీయాలు చేయడం మానేయాలని ఆయన అన్నారు. మీ దృష్టిని బీజేపీ మీద నుంచి మళ్లించి, మీకు రాజకీయ భిక్షను పెట్టిన కాంగ్రెస్ ను పైకి లేపడంపై సారించాలని సూచించారు.