రేపు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్న జగన్.. షెడ్యూల్ ఇదిగో!
- రేపు చెన్నేకొత్తపల్లికి వెళ్తున్న జగన్
- రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
- పంటల బీమా మెగా చెక్ ను అందించనున్న ముఖ్యమంత్రి
10.50 గంటలకు చెన్నేకొత్తపల్లికి చేరుకుని... 15 నిమిషాల పాటు స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడతారు. ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. పంటల బీమా మెగా చెక్ ను రైతులకు అందించి మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. మధ్యాహ్నం 2.50 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.