సర్కారీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1 కోటి ఇచ్చిన టీఆర్ఎస్ ఎంపీ
- చేవెళ్లలో కొత్తగా 30 పడకలతో సర్కారీ ఆసుపత్రి
- రూ.1.55 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చిన అధికారులు
- రూ.1 కోటి ఇస్తానంటూ ముందుకు వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి
చేవెళ్ల పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.1.55 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తేల్చారు. ఈ నిధుల్లో తన వాటాగా రూ.1 కోటిని అందించనున్నట్లు రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ దిశగా వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు రంజిత్ రెడ్డి రాసిన లేఖను కూడా ఆసిఫ్ తన ట్వీట్‌కు జత చేశారు.