రజనీ సినిమాలో అన్నీ విశేషాలే!
- రజనీ 169వ సినిమాకి సన్నాహాలు
- ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగు
- రజనీ భార్య పాత్రలో ఐశ్వర్యరాయ్
- కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
- నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం
'రోబో' తరువాత రజనీ - ఐశ్వర్యరాయ్ కలిసి నటించనున్న సినిమా ఇది. ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'నరసింహా' సినిమాతో ఈ ఇద్దరూ కలిసి ఎలాంటి సంచలనానికి తెర తీశారనేది తెలిసిందే. అలాంటి ఒక పవర్ఫుల్ పాత్రలోనే రమ్యకృష్ణ కనిపించనుందని అంటున్నారు.
ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ప్రియాంక అరుళ్ మోహన్ ఎంపిక జరిగిపోయింది. ఈ సినిమాలో ఒక యంగ్ హీరో జోడీగా ఆమె కనిపించనుంది. ఈ కథ రజనీకాంత్ రాసుకున్నదే కావడం .. కేఎస్ రవికుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చడం మరో విశేషం. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.