ఉత్కంఠను రేకెత్తించనున్న'రెక్కీ' .. ఈ నెల 17 నుంచి జీ 5లో!
- జీ 5 నుంచి 'రెక్కీ' వెబ్ సిరీస్
- క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ - ధన్య బాలకృష్ణ
- ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్
ఇక ఇప్పుడు జీ 5వారు 'రెక్కీ' అనే పేరుతో మరో వెబ్ సిరీస్ ను వదలడానికి రెడీ అవుతున్నారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీరామ్ కొలిశెట్టి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు. 1990లో తాడిపత్రిలో జరిగిన ఒక హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ హత్య కేసును ఛేదించడానికి ఇన్ స్పెక్టర్ లెనిన్ రంగంలోకి దిగుతాడు. అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేదే కథ.
క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో .. గ్రామీణ ఫ్యాక్షన్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్స్ గా ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ 25 నిమిషాల నిడివిని కలిగి ఉంటుంది. జూన్ 17 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అడుగడుగునా ఈ వెబ్ సిరీస్ ఉత్కంఠను రేకెత్తిస్తుందని దర్శకుడు చెబుతున్నాడు. శ్రీరామ్ .. శివ బాలాజీ .. ఆడుకాలం నరేన్ .. ధన్య బాలకృష్ణ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
.