జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నేనా..? ఎవరు చెప్పారు?: సోనాలి బింద్రే
- తనకైతే ఆ విషయం తెలియదన్న సోనాలి
- ఇది తప్పుడు వార్త అయి ఉంటుందని వ్యాఖ్య
- లేదంటే తన వరకు ఇంకా రాకపోయి ఉండొచ్చన్న బింద్రే
ఈ సినిమాలో తాను కూడా నటించనుందన్న వార్తలపై తాజా ఇంటర్వ్యూలో భాగంగా సోనాలీకి ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘‘ఎవరు.. నేనా? నాకు తెలియదు. దీని గురించి మీరే చెప్పాలి. మీరు మాట్లాడే విషయం గురించి నాకు తెలియదు. నేను వినలేదు కూడా. ఇది తప్పుడు వార్త అయి ఉంటుంది. లేదా ఇంకా నా వరకు రాకపోయి ఉండొచ్చు’’ అని బింద్రే బదులిచ్చింది.
బింద్రే త్వరలో మొదలయ్యే ఒక టీవీ షోలో జర్నలిస్ట్ అమీనా ఖురేషి పాత్రను పోషిస్తోంది. సోనాలి బింద్రే గోల్డీ బెహెల్ ను వివాహం చేసుకోగా, వీరికి 15 ఏళ్ల కుమారుడు రణవీర్ బెహెల్ కూడా ఉన్నాడు. 2018లో ఆమెకు మెటాస్టాటిక్ కేన్సర్ ఉన్నట్టు బయటపడగా.. చికిత్స తీసుకుని కేన్సర్ మహమ్మారిని బింద్రే అధిగమించింది. ఇందులో తన భర్త సహకారం ఎంతో ఉన్నట్టు ఆమె లోగడ చెప్పింది.