మహానాడులో చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలెవరూ నమ్మడంలేదు: బొత్స
- వైసీపీ సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో మంత్రి బొత్స
- బాబు మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్య
- చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని స్పష్టీకరణ
గతంలో చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచేశాడని, వరల్డ్ బ్యాంకు బిచ్చగాడు అంటూ చంద్రబాబుకు ముద్రపడిందని అన్నారు. ఇటీవల కోనసీమలో జరిగిన అల్లర్లతో చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని బొత్స విమర్శించారు.