ఫోర్ కొట్టి ఏడుసార్లు ఛాతీని చరుచుకున్న రవిచంద్రన్ అశ్విన్.. వీడియో వైరల్
- చివరి ఓవర్‌లో ఫోర్ కొట్టాక సంబరాలు
- మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన అశ్విన్
- తనలోని వార్నర్‌ను బయటకు తెచ్చానన్న అశ్విన్
ఈ అద్భుత ఇన్నింగ్స్‌ను పక్కనపెడితే మైదానంలో అతడు చేసుకున్న సెలబ్రేషన్ ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే అశ్విన్.. చివరి ఓవర్‌లో ఫోర్ కొట్టిన తర్వాత ఛాతీని ఏడుసార్లు కొట్టుకుని సంబరాలు చేసుకున్నాడు. బంతి బౌండరీ లైన్‌ను తాకిందో, లేదో గుండెను చరుచుకుంటూ అతడు సంబరాలు చేసుకోవడం కెమెరాకు చిక్కింది. ఇప్పుడా వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు, మ్యాచ్ ముగిసిన అనంతరం అశ్విన్ మాట్లాడుతూ.. తనలోని డేవిడ్ వార్నర్‌ను బయటకు తెచ్చానంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.