'ఖైదీ' సీక్వెల్ లో సూర్య కూడానా?
- తక్కువ బడ్జెట్ లో రూపొందిన కార్తి 'ఖైదీ'
- కాసుల వర్షం కురిపించిన సినిమా ఇది
- సీక్వెల్ కి సిద్ధమవుతున్న మేకర్స్
- సూర్య కూడా ఈ సినిమాలో కనిపించనున్నాడంటూ ప్రచారం
సినిమా మొత్తంలో ఆర్టిస్టులంతా సింగిల్ కాస్ట్యూమ్ తోనే కనిపిస్తారు. అయినా ఎక్కడా బిగి తగ్గకుండా నడిచే ఈ కథ కాసుల వర్షం కురిపించింది. అందువలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తో సీక్వెల్ చేయడానికి కార్తి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య కూడా చేయనున్నాడనేది తాజా సమాచారం.
'ఖైదీ' సినిమాను నిర్మించిన ఎస్.ఆర్.ప్రభు ఈ సీక్వెల్ ను కూడా నిర్మించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సూర్య - కార్తి కలిసి ఈ హిట్ మూవీ సీక్వెల్లో నటిస్తే మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. 'విక్రమ్' ను రిలీజ్ కి రెడీ చేస్తున్న లోకేశ్ కనగరాజ్, ఆ తరువాత ప్రాజెక్టుగా ఈ సినిమా చేయనున్నాడు.