యాక్షన్ కామెడీగా బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా!
- గోపీచంద్ మలినేనితో బాలయ్యా సినిమా
- తరువాత చేయనున్న అనిల్ రావిపూడి ప్రాజెక్టు
- అందుకోసం జరుగుతున్న సన్నాహాలు
- కథానాయికగా తెరపైకి మెహ్రీన్ పేరు
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్నారు. కెరియర్ పరంగా ఇది బాలకృష్ణకి 107వ సినిమా. రాయలసీమ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమాలో 14 ఏళ్లు జైలు శిక్షను అనుభవించి వచ్చిన ఒక నేరస్థుడి పాత్రను బాలయ్య పోషించనున్నారట.
ఫస్టాఫ్ అంతా కూడా బాలయ్య మార్కు యాక్షన్ తోను .. సెకండాఫ్ అంతా కూడా అనిల్ మార్కు కామెడీతోను ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ఒక కథానాయికగా మెహ్రీన్ కనిపించనుందని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ అతిథి పాత్రను పోషించనున్నారని చెబుతున్నారు.