బొత్సపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్‌పై డిస్కం సీఎండీ వివరణ
- హైదరాబాద్‌లోని తన ఇంటికి బొత్స 15 నెలలుగా విద్యుత్ బిల్లు కట్టడం లేదంటూ ట్వీట్ చక్కర్లు
- అది బోగస్ ట్వీట్ అన్న రఘుమారెడ్డి
- డిస్కం ట్విట్టర్ ఖాతాలో మంత్రికి సంబంధించి ఎలాంటి సమాచారమూ షేర్ చేయలేదని వివరణ
ఈ ట్వీట్‌పై స్పందించిన రఘుమారెడ్డి.. అది బోగస్ ట్వీట్ అని స్పష్టం చేశారు. మంత్రికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని డిస్కం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయలేదని వివరణ ఇచ్చారు. సంస్థ పేరుతో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని రఘుమారెడ్డి హెచ్చరించారు.