మంచు విష్ణు ఇంట్లో ఆలూ పరాటా చేసిన సన్నీ లియోన్.. వీడియో ఇదిగో!
- ప్రస్తుతం మంచు విష్ణు సినిమాలో నటిస్తున్న సన్నీ లియోన్
- హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్న సన్నీ
- సన్నీ పరాటా చేసిన వీడియోను షేర్ చేసిన మంచు విష్ణు
మరోవైపు మంచు విష్ణు సినిమాలో నటిస్తున్న సన్నీ హైదరాబాదులో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మంచు విష్ణు ఇంట్లో ఆమె ఆలూ పరాటా తయారు చేసింది. ఈ వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేయగా... ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
హాఫ్ శారీ కట్టుకున్న సన్నీ లియోన్ విష్ణు ఇంట్లో ఉన్న కిచెన్ లో పరాటా చేసింది. పక్కన ఉన్న విష్ణు ఆమెకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరూ సరదాగా మాట్లాడుతూ జోక్స్ వేసుకున్నారు. తమ కాలేజీ రోజుల్లో ఎవరైనా బ్యాక్ ఓపెన్ అయినట్టు ఉంటే ఆమ్లెట్ వేసేవాళ్లమని విష్ణు చెప్పాడు.