హనుమాన్ మాల ధారణ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఫొటో ఇదిగో!
- ఆర్ఆర్ఆర్ తో ఘనవిజయం
- కొత్త చిత్రం కోసం సన్నద్ధం
- కొరటాల శివ దర్శకత్వంలో ప్రాజెక్టు
ఆర్ఆర్ఆర్ కోసం అత్యధిక సమయం కేటాయించిన ఎన్టీఆర్... ఇక స్పీడు పెంచాలని నిర్ణయించారు. జూన్ లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం అలియా భట్ ను హీరోయిన్ అనుకున్నప్పటికీ, ఆమె పెళ్లి చేసుకోవడంతో ఎన్టీఆర్ సరసన కథానాయిక ఎవరన్నది ఆసక్తి కలిగిస్తోంది.