బిల్లు చెల్లించమన్న ఆసుపత్రి.. మర్డర్లు చేసే నన్నే బిల్లు అడుగుతావా? అంటూ వైసీపీ నేత అనుచరుడు చికెన్‌బాషా వీరంగం
- రక్తస్రావం, నొప్పులతో ఆసుపత్రిలో చేరిన బాషా కుమార్తె
- చికిత్స చేసి డబ్బులు చెల్లించమన్న ఆసుపత్రి
- అనుచరులతో కలిసి సిబ్బందిపై దాడి
- ఫిర్యాదు చేసిన ఆసుపత్రి యాజమాన్యం
- రాజీ కోసం సిద్ధార్థరెడ్డి అనుచరుల ప్రయత్నాలు
ఆ మాట వినగానే ఆగ్రహంతో ఊగిపోయిన బాషా అనుచరులతో కలిసి సిబ్బందిపై దాడికి దిగారు. మర్డర్లు చేయడమే వృత్తిగా పెట్టుకున్న నన్నే డబ్బులు అడుగుతారా? మీ అంతు చూస్తా? అని హెచ్చరించారు. తాను బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మనిషినని, తలచుకుంటే సాయంత్రానికల్లా ఇక్కడ ఆసుపత్రి ఉండదని వార్నింగ్ ఇచ్చారని ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఆయితే, ఫిర్యాదు పత్రంపై సంతకం లేదని, ఇందుకోసం పోలీసులను ఆసుపత్రికి పంపినా సంతకం చేయలేదని నందికొట్కూరు ఎస్సై తెలిపారు. మరోవైపు, నిన్న సాయంత్రం సిద్ధార్థరెడ్డి అనుచరులు, యాదవ సంఘం నాయకులు ఆసుపత్రికి వచ్చి రాజీ కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది.