బన్నీ, ధనుష్ క్రేజీ కాంబోలో కొరటాల మూవీ!
- ప్రస్తుతం ఆచార్య సినిమాతో కొరటాల బిజీ
- ఆ తర్వాత తారక్ సినిమా షూటింగ్
- అది అయిపోగానే అల్లు అర్జున్, ధనుష్ తో సినిమా చేస్తారని ప్రచారం
ఆ ఇద్దరినీ కొరటాల శివ ఒకే స్క్రీన్ లోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారు. తారక్ సినిమా పూర్తవ్వగానే.. బన్నీ, ధనుష్ లతో సినిమాను పట్టాలెక్కిస్తారని చెబుతున్నారు. అయితే, దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇంకా రాలేదు. ఒకవేళ ఈ కాంబోగానీ ఓకే అయితే అభిమానులకు పండగే మరి!!