ఆస్కార్ వేడుకలో యాంకర్‌ను కొట్టిన సినీనటుడు విల్ స్మిత్‌కు కంగనా రనౌత్ మద్దతు
- యాంకర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తే గట్టిగా బదులిస్తా
- మా అమ్మ లేక సోదరికి ఉన్న వ్యాధిని అవహేళన చేస్తూ మాట్లాడితే అలాగే చేస్తా
- జోక్ వేయడానికి అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటన్న కంగనా
జోక్ వేయడానికి ఎవడైనా ఇడియట్ తన అమ్మ లేక సోదరికి ఉన్న వ్యాధిని అవహేళన చేస్తూ మాట్లాడితే తాను కూడా విల్ స్మిత్‌లాగే చేస్తానని చెప్పింది. తాను కూడా గట్టిగా బదులిస్తానని పేర్కొంది. ఆ యాంకర్ త్వరలోనే తన లాకప్ షోకి కంటెస్టెంట్‌గా వస్తాడని ఆశిస్తున్నానని చెప్పింది. నవ్వుతోన్న ఎమోజీని ఆమె ఈ సందర్భంగా జోడించింది.