వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది: ప్రకాశ్ రాజ్
- ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్
- నీరాజనాలు పడుతున్న జనాలు
- సినిమా బ్రహ్మాండంగా ఉందన్న సినీ ప్రముఖులు
- ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు తెలిపిన ప్రకాశ్ రాజ్
కాగా, ఈ చిత్రంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త హద్దులు ఏర్పాటు చేశారని కితాబునిచ్చారు.
దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల రూపంలో రెండు తుపాకీలతో రాజమౌళి గురిపెట్టారని వ్యాఖ్యానించారు. బాక్సాఫీసు రికార్డులు బద్దలయ్యేందుకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.