హిందీలో డీలాపడిన 'రాధేశ్యామ్'
- ఈ నెల 11వ తేదీన వచ్చిన 'రాధే శ్యామ్'
- మొదటి మూడు రోజుల్లో 151 కోట్ల గ్రాస్
- వీకెండ్ తరువాత తగ్గుముఖం పట్టిన వసూళ్లు
- 'సాహో' మార్కును కూడా అందుకోలేకపోయిన 'రాధేశ్యామ్'
తొలి రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 79 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 3 రోజుల్లో 151 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఆ తరువాత మాత్రం ఈ సినిమా జోరు తగ్గడం మొదలుపెట్టింది. గతంలో ప్రభాస్ నుంచి వచ్చిన 'బాహుబలి' .. 'బాహుబలి 2' 'సాహో' సినిమాలు హిందీలో భారీ వసూళ్లను సాధించాయి.
దాంతో ఈ సినిమా కూడా హిందీలో లాంగ్ రన్ లో 100 కోట్ల వరకూ వసూలు చేయవచ్చని అనుకున్నారు. అయితే హిందీ వెర్షన్ విషయంలో అంచనాలు మరీ తలక్రిందులయ్యాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా అక్కడ 20 కోట్లకి మించి వసూలు చేయకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.