పవన్ తో మరో ప్రాజెక్ట్ సెట్ చేసిన త్రివిక్రమ్!
- పవన్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్
- ఇద్దరి ఖాతాల్లో రెండు భారీ హిట్లు
- నాల్గో సినిమాకి సన్నాహాలు
- వచ్చే ఏడాది సెట్స్ పైకి
పవన్ కీ .. త్రివిక్రమ్ కి మధ్య మంచి స్నేహం ఉంది. ఇటీవల వచ్చిన 'భీమ్లా నాయక్' సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే చేయడానికీ .. సంభాషణలు అందించడానికి .. ఒక పాట రాయడానికి కారణం ఆ స్నేహమే. అలాంటి ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రూపొందనుంది. ఆల్రెడీ త్రివిక్రమ్ లైన్ చెప్పడం .. పవన్ ఓకే అనడం జరిగిపోయాయట.
అయితే ఈ నెల 18వ తేదీ నుంచి పవన్ 'హరి హర వీరమల్లు' తాజా షెడ్యూల్ షూటింగులో పాల్గొననున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ఆ తరువాత 'భవదీయుడు భగత్ సింగ్' కోసం హరీశ్ శంకర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆ వెంటనే సురేందర్ రెడ్డితో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ ప్రాజెక్టు మొదలవుతుందట.